NZB: యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం సూచించారు. బోధన్ డివిజన్ పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో ఆయన పాల్గొన్నారు. ఎడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జిల్లా పోలీస్ శిక్షణ మైదానంలో 26 టీంలను ఏర్పాటు చేసి క్రికెట్ టోర్నీని బోధన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు.