GDWL: అలంపూర్ 5వ శక్తిపీఠం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానంలో ఈనెల 21వ తేదీ శుక్రవారం బహిరంగ టెండర్ల వేలం పాట నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో దీప్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వేలంలో పార్కింగ్ వసూలు, చీరలు, టెంకాయలు అమ్ముకొనుటకు బహిరంగ, సీల్డ్ టెండర్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెండర్లలో పాల్గొనాలంటే ఆలయ అధికారులను సంప్రదించాలన్నారు.