VZM: ప్రజల పిటిషన్లు సంతృప్తికరంగా పరిష్కరించాలని, ప్రీఆడిట్ తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అర్జీదారులతో మాట్లాడి వాస్తవ వివరాలు నమోదు చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు సచివాలయాల్లో ఉండటం లేదన్న కలెక్టర్… సిబ్బంది హాజరుపై అకస్మాత్తుగా తనిఖీలు చేయాలని ఆదేశించారు.