W.G: ధాన్యం సేకరణలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీవో ఖతీబ్ కౌసర్ బానో తెలిపారు. సోమవారం తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ, వ్యవసాయ, సొసైటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ-క్రాప్ వివరాలు ధాన్యం కొనుగోలు కేంద్రంలో చూపకపోవడంతో ట్రక్ షీట్ జనరేట్ కావడంలో తలెత్తుతున్న సమస్యలను పలువురు ప్రస్తావించారు.