SRPT: నాగారంలోని జనగామ రహదారిపై వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ కమలాకర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన స్థలాన్ని సోమవారం ఎస్పీ నరసింహ పరిశీలించారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తనిఖీలు నిర్వహించే చోట బారికేడ్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.