WNP: వనపర్తి పట్టణంలో రోడ్లపై పార్కింగ్ నివారణపై ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్సై సురేంద్ర షాపుల యజమానులకు అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ.. షాపుల ముందు వాహనాలు నిలపడం వల్ల రోడ్లు బ్లాక్ అవుతున్నాయని, అత్యవసర సేవలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని తెలిపారు. రోడ్డు కోసం నియమాలు అవసరమని, అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు.