ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని నల్లగండ్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ గ్రామసభ ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ .. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేయదగిన పనులను గుర్తించాలన్నారు. ఉపాధి కూలీలు ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు.