GNTR: తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి వచ్చే ప్రధాన పైప్‌లైన్‌కు ఏర్పడిన లీక్‌ను సరిచేయడానికి మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ కారణంగా నవంబర్ 20 ఉదయం నుంచి 22 సాయంత్రం వరకు గుంటూరు నగరంలో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిపివేయబడుతుంది. కావున ప్రజలు ఈ మూడు రోజుల కోసం ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలి అని కమిషనర్ పులి శ్రీనివాసులు సోమవారం విజ్ఞప్తి చేశారు.