ATP: కనేకల్ మండలంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని AIKMS జిల్లా కార్యదర్శి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కనేకల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కూటమి అధికారంలోకి వస్తే గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారం చేపట్టి 18 నెలలు గడిచినా పేదల గురించి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.