ఆసియాకప్ రైజింగ్ స్టార్స్- 2025 టోర్నీలో భాగంగా శ్రీలంక-A, హాంకాంగ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 117/9 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన లంక 13.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.