CTR: లెప్రసీ గుర్తింపుకు చర్మ పరీక్షలు తప్పనిసరి అని ముడి పాపనపల్లి PHC డాక్టర్ సృజన తెలిపారు. పుంగనూరు మండలంలోని రాగానిపల్లిలో ‘లెప్రసీ కేసు డిటెక్షన్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు .ఈ నెల 30 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, సూపర్వైజర్లు ప్రతి ఇంటిని సందర్శించి లెప్రసీపై అవగాహన కల్పించి, చర్మంపై ఉన్న అనుమానాస్పద మచ్చలను గుర్తించాలని సూచించారు.