CTR: సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి త్వరలో కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజులు పర్యటించనున్నట్లు ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. పర్యటనలో భాగంగా DK చెరువుకు చేరిన కృష్ణమ్మ జలాలకు జల హారతి ఇవ్వనున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సోమవారం చెరువును సందర్శించి భువనేశ్వరి పర్యటించనున్న స్థలాన్ని పరిశీలించారు.