W.G: తణుకు నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారి పక్షాన పోరాడేందుకు ముందు ఉంటానని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. గోవులను వధిస్తూ మహా పాపానికి ఒడిగడుతున్న లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ కర్మాగారం మూసి వేసే వరకు ఉద్యమం చేపడతానని చెప్పారు.