PPM: రెవిన్యూకు సంబంధించిన అర్జీలను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవిన్యూ క్లినిక్‌ను సందర్శించి రెవిన్యూ వినతులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయపరమైన దరఖాస్తుదారులకు సంతృప్తికరమైన పరిష్కారం అందించాలన్నారు.