SKLM: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో గిరిజన యువతకు సోమవారం ఉద్యాన వ్యవసాయ పంటలపై శిక్షణ కార్యక్రమం ప్రారంభించినట్లు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కె భాగ్యలక్ష్మి తెలిపారు. షెడ్ నెట్లో ప్రో ట్రే విధానం ద్వారా కూరగాయల నారు పెంపకంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమo నిర్వహిస్తున్నామన్నారు. చీడపీడల నివారణ, కూరగాయల రకాల ఎంపిక అంశాలను శాస్త్రవేత్త హరికుమార్ వివరించారు.