GDWL: జిన్నింగ్ మిల్లుల యజమానులు నిరసనతో కొనుగోలు బంద్ చేసినా రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ అనుమతితో, కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నాం అని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి గద్వాల శివారులోని బాలాజీ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు.