RR: షాద్‌నగర్‌కు చెందిన బీసీ నేత చంద్రశేఖరప్పను బీసీ జనసేన జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తూ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా విద్యానగర్‌లో సంఘాన్ని అధికారికంగా ప్రారంభించి అనుమతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ వర్గాల సమస్యలు, హక్కులు, అవకాశాల కోసం బలమైన ఉద్యమం ప్రారంభమవుతుందన్నారు.