NGKL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 48 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రకటించారు. అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు అందరూ తమ పరిధిలో వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.