E.G: కొవ్వూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో AMC ఛైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ చౌదరి అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. మార్కెట్ కమిటీ పనితీరు, రైతులకు మెరుగైన సౌకర్యాల అందుబాటు, పారదర్శక సేవలపై చర్చించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.