MBNR: అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు సోమవారం విజయవంతంగా ముగిశాయి. స్వామివారి ఆభరణాలను ఎస్బీఐ ఆత్మకూరు శాఖ లాకర్లో భద్రపరిచినట్లు ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, ఛైర్మన్ జీ. గోవర్ధన్ రెడ్డి చెప్పారు. జాతర నిర్వహణకు సహకరించిన వివిధ శాఖల అధికారులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.