MDK: పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఈఈ ప్రసన్న సోమవారం పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లిన ఈఈ అర్హులు నివసిస్తున్నారా లేదా అన్న విషయాలను పరిశీలించారు. ఇళ్లు ఏమైనా ఖాళీగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాకీర్ అలీ పాల్గొన్నారు.