ATP: గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామ సమీపంలోని హైవేపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ఐచర్ వాహనం ఢీకొనడంతో బైక్ మీద వెళ్తున్న మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.