VSP: జీవీఎంసీ పరిధిలో పీజీఆర్ఎస్లో 102 వినతులు అందాయని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులు జోన్లవారీగా 1వ జోన్లో 6, 2వ జోన్లో 17, 3వ జోన్లో 14, ఇతర జోన్లలో కలిపి 65 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రణాళిక విభాగానికి 53 ఫిర్యాదులు వచ్చాయన్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు అదేశించారు.