TG: రాష్ట్రంలో ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ అమలు కావడం లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ‘ప్రభుత్వంపై పోరాటంలో BRS, BJPలు విఫలమయ్యాయి. అందుకే తెలంగాణ జాగృతి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాడుతుంది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ను గ్రామాల్లో తింటుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపునకు కారణం విపక్షాల వైఫల్యమే’ అని అన్నారు.