KDP: ప్రొద్దుటూరులోని అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రా రెడ్డి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల అధ్యక్షుడు వంగల నారాయణరెడ్డి, ఈవో వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.