KMM: ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కామేపల్లి మండలంలో సోమవారం పర్యటించారు. సిస్టమ్ పెండింగ్ సమస్యల కారణంగా ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పెద్ద చెరువులో మత్స్యకార సంఘం సభ్యులకు 100% రాయితీతో చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఎంపీడీవోతో సమీక్ష నిర్వహించారు.