AP: కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నాలుగో సోమవారం కావడంతో భక్తులు శ్రీశైలానికి పోటెత్తారు. ఉదయం నుంచే అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ముందుగా భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించుకుని శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో దర్శనానికి వచ్చే భక్తులకు అల్ఫాహార ఏర్పాట్లు చేశారు.