సత్యసాయి: ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు పుట్టపర్తి రానున్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మంత్రి సవిత, నోడల్ అధికారులు, కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పర్యటన ఏర్పాట్లు, భద్రతపై చర్చించారు.