MNCL: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 16 వరకు నల్గొండలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 17 బాలికల పుట్ బాల్ పోటీలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్ నగర్ జట్టు 5-3 స్కోర్‌తో మొదటి స్థానం సాధించింది. ఈ సందర్భంగా మంచిర్యాల డీఈవో యాదయ్య, ఎస్జీఎఫ్ కార్యదర్శి యాకూబ్, తదితరులు జట్టును అభినందించారు.