ATP: రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేర్చాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 19న రాయదుర్గం నియోజకవర్గంలోని 38,508 మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ రెండో విడత కింద రూ. 26.95 కోట్లు జమ కానున్నాయని తెలిపారు.