CTR: జిల్లాలో మామిడి రైతులను ఆదుకోవాలని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన మామిడి పండ్ల పరిశ్రమల యజమానులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 31,929మంది రైతులకు కే.జి మామిడికి రూ.4 సబ్సిడీ చొప్పున మొత్తం రూ.146.84 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందన్నారు.