SDPT: ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో “పోలీస్ కమీషనర్ తో ఫోన్-ఇన్” కార్యక్రమం వారంలో ఒకరోజు నిర్వహించడం జరుగుతుందని సిద్దిపేట్ పోలీస్ కమిషనరు విజయ్ కుమార్ తెలిపారు. ప్రతి శనివారం ఉదయం 11.00 నుంచి 12.00 గంటల వరకు ఫోన్ నంబర్ 8712667100, 8712667306, 8712667371 లకు ఫోన్ చేసి సమస్యలు వివరించవచ్చన్నారు.