SRD: సీఎస్ఆర్ నిధులతో గ్రంథాలయాలు డిజిటల్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు.