NLG: కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ ఛైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి సోమవారం సందర్శించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే రైతులు తమ ధాన్యాన్ని సకాలంలో ఎండబెట్టి తేమ తగిన రీతిలో ఉండేలా తేవాలన్నారు.