ప్రకాశం: హనుమంతునిపాడు మండలం కొత్త సీతారాంపురంలో ఇవాళ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు భూమిలేని పేదలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను పెత్తందారులు, భూస్వాములు ఆక్రమిస్తున్నారన్నారు. వీళ్ళపై రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు ఉండటం లేదన్నారు. భూమిలేని పేదలకు భూములు ఇవ్వాలని తెలిపారు.