BDK: ప్రభుత్వ వసతి గృహాల్లో పనితీరు సక్రమంగా లేదని మాజీ జడ్పీటీసీ పాల్వంచ దుర్గ సోమవారం పీవో రాహుల్కు వినతి పత్రం అందజేశారు. హాస్టల్ వార్డెన్లు రోజువారిగా విధులు నిర్వహించడం లేదని, విధులకు గైర్హాజరు అవుతున్నారని తెలిపారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పివోను కోరినట్లు వెల్లడించారు.