అన్నమయ్య: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఇవాళ ఎస్పీ ధీరజ్ PGRS కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి కుటుంబ కలహాలు, భూ- ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ ప్రేమపేరుతో జరిగే మోసాలపై వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ.. తక్షణ న్యాయం కల్పించి ఏ ఆలస్యం జరగకుండా చూడాలని ఆదేశించారు.