SRD: జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 21 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. ఈ నెల 21, 22 తేదీల్లో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు, 24, 25 తేదీల్లో ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎంఈవోలకు సూచించారు.