KDP: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను బెదిరించిన ఏడుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేను బెదిరించి రూ.1 కోటి కాజేశారని ఆయన తెలిపారు. తాజాగా ఈ కేసులోని నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశామన్నారు. నిందితుల్లో ఢిల్లీకి చెందిన IDFC బ్యాంక్ మేనేజర్ కూడా ఉండడం గమనార్హం.