అన్నమయ్య: కోడూరు నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపన అత్యవసరమని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇవాళ కోడూరులో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అనేక మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వేలాది కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందన్నారు.