ఉరిశిక్ష పడిన నేపథ్యంలో బంగ్లా మాజీ ప్రధాని హసీనాను ఆ దేశానికి భారత్ అప్పగిస్తుందా అనే చర్చ జరుగుతోంది. అయితే హసీనా అప్పగింతపై భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. భారత్- బంగ్లా మధ్య సంబంధాలు, ప్రాంతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు తెలిపారు. ఉరిశిక్ష అమలుపై కూడా భారత్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.