KDP: వేంపల్లి పట్టణంలో ఇవాళ రెండుచోట్ల దొంగతనం జరిగిందని డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు. అయితే వారి వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే తేజ బట్టల దుకాణం, లక్కీ హెయిర్ స్టైల్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డట్లు పేర్కొన్నారు. పట్టుచీరలు, నగదుతోపాటు స్మార్ట్ టీవీలను అపహరించారన్నారు. వెంటనే షాపుల యజమానులను విచారించి సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలియాజేశారు.