PPM: పీజీఆర్ఎస్కు వచ్చిన ప్రతి దరఖాస్తుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ డా.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్వో,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో కలిసి ఆర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, సమర్థత పెంచడమే లక్ష్యం అన్నారు.