SRPT: శీతాకాలం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిందని, ఉదయం వేళల్లో మంచు కురుస్తున్నందున వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొగమంచు పేరుకు పోవడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని కోరారు.