NZB: గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ప్రభుత్వాన్ని కోరారు. నందిపేట్ మండల కేంద్రంలో సోమవారం ధర్నా నిర్వహించి ఎంపీడీవోకు వినతి పత్రాన్ని అందజేశారు. దాసు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం.. కార్మికుల సమస్యల పరిష్కరించాలని, పీఎఫ్ ఈఎస్ఐ చట్టాల అమలు చేయాలన్నారు.