పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. తాజాగా ఈ మూవీపై డైరెక్టర్ హను బిగ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు వెల్లడించాడు. రెండో పార్ట్ ప్రీక్వెల్‌గా ఉంటుందని తెలిపాడు. కాగా, ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.