TG: ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుతో BOMMA సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఆ వెబ్సైట్ చేసిన యూజర్లకు ‘మా సేవలు అందుబాటులో లేవు. మీరు ఇటీవల మా గురించి విని ఉండవచ్చు లేదా మొదటి నుంచి నమ్మకమైన అభిమానిగా ఉండవచ్చు. ఏదేమైనా, మీ దేశంలో మా సేవలు శాశ్వతంగా నిలిపివేయబడ్డాయని చెప్పడానికి మేము చింతిస్తున్నాము. నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నాము’ అనే సందేశం కనిపిస్తోంది.