VZM: వైద్యులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని రాజాం వైసీపీ ఇంఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ అన్నారు. రాజాంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. డాక్టర్లు సర్జరీ చేయలేకపోతున్నారని చెప్పడం అవమానించడమే అన్నారు. ఏఐ టెక్నాలజీ తెచ్చినా డాక్టర్ల అవసరం ఉంటుందన్నారు. ఈ వ్యాఖ్యలతో డాక్టర్లపై దాడులు జరిగే అవకాశం ఉందన్నారు.