MDK: రామాయంపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఇవాళ జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు రికార్డులను, మందుల నిల్వలను తనిఖీ చేశారు. అనంతరం పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.