NZB: జిల్లాకు చెందిన ప్రముఖ కవి తొగల సురేష్ ‘పెందోట సాహిత్య పురస్కారం’ అందుకున్నారు. సిద్దిపేటలో శ్రీవాణి సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పుస్తకాల పోటీలో తొగర్ల సురేశ్ రాసిన ‘వెన్నెల్లో మా పల్లె‘ పుస్తకానికి గాను ఈ పురస్కారం లభించింది. ఈ వివరాలను కవి కంకణాల రాజేశ్వర్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు.